1. ఆది జనకుడు ఏదేను తోటలో
శోధనలో పడి వేధించినపుడు
ఆశలన్ని అడియాశలుగా జేసె
అధములను నీవు ఆదరింతువు
అమృతమూర్తి నీవే - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||
2. స్థానము విడచి తన మహిమ విడచి
అనుదినము నిను దూషించు వైరి
ప్రధానత్వమును పాడుచేసికొని
నీ ప్రభుత్వమున్ నిరాకరించిన
నీచున్ ప్రేమించితివి - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||
3. పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని
వేలకొలది వాగ్దానములతో
కలిమియందున కలతలందున
తొలగిపోయిన తల్లడిల్లిన
చల్లగ కాచితివి - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||
4. రాజ్యమేలిరి రారాజు లెందరో
రాజనగరుల రత్నాల సిరులతో
రాజ్యకాంక్షతో రణములు సలిపిరి
రథములను చూచి సదయున్ మరచిన
నిత్య సాత్వీకుడవు - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||
5. పరమ జనకుని పలు వాక్కు లెన్నియో
ధరను ప్రజలకు ప్రవచించు కొరకై
నిర్ణయించితివి దైవజనులను
పేరాశ కలిగి పెడత్రోవ నడచిన
కరుణించితివి వారిన్ - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||
6. పాడెదన్ ప్రభూ నీ ప్రేమగీతం
పడిచెడిన నన్ను ప్రేమించితివివని
కడిగితివి ప్రభు - కలుషమునెల్ల
విడచిన నేను నీ జాడలన్నియు
నడిపించె నావికుడ - ప్రభూ - సాటి నీకెవరు?
|| ఆద్యంత ||