1. యే నరుని పేరులేని సంఘమిది
యే సిద్ధాంతపు పేరులేని సంఘము
స్థానదినముల పేరు లేనిదిది
ఏలాటి పేరు వహించనియట్టి
|| సంఘమొక్కటే ||
2. యూదులని హెల్లేనీయులని లేదు
సున్నతిపొందియున్న లేకున్నను
దేశీయుడు పరదేశీయని లేదు
స్వాతంత్ర్య దాస్య స్త్రీ పురుషుడని లేని
|| సంఘమొక్కటే ||
3. ఆత్మైక్యమను యేడు పేటలత్రాడు
ఈ త్రాటిచే సంఘము కట్టబడెను
ఇట్టి జీవముకల్గి లోకమునకు
వేరైన జీవము జీవించుచున్నట్టి
|| సంఘమొక్కటే ||
4. సంఘమే శరీరం శరీరమే సంఘం
దివ్య దృష్టాంతములతో నిండినది
దేవుని ఇల్లాయన నివాసస్థలం
నవీన వరుడు రాజనగరము ఇల్లు
|| సంఘమొక్కటే ||
5. ఇంటికి పునాది ఆధారమైనట్లు
ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చునట్లు
నర శరీరమునకు తలవలె
భార్యకు భర్తవలె క్రీస్తునుగల
|| సంఘమొక్కటే ||
6. సార్వత్రిక సభను కానగ లేని
కారణాన సైతాను కలవరమునొందె
స్థల సంఘము ద్వారా సార్వత్రికమైన
సంఘమునుజూప వీలగు నిజము
|| సంఘమొక్కటే ||
7. మరుజన్మ మొందినవారే యీ సంఘము
అసమాను డేసుడే యద్దాని శిరము
యోగ్యముగా నైదుసేవల జేతుము
ముదమున పాడుము హల్లెలూయ
|| సంఘమొక్కటే ||