1.యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని
|| దేవునికి ||
2.గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని
వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని
|| దేవునికి ||
3.నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని
|| దేవునికి ||
4.ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
|| దేవునికి ||
5.దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
|| దేవునికి ||
6.ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని
|| దేవునికి ||
7.పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును
అరచుపిల్ల కాకులకును - ఆహారము తానీయును
|| దేవునికి ||
8.గుర్రముల నరులందరి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించు వాడని
|| దేవునికి ||
9.యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని
|| దేవునికి ||
10.పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
|| దేవునికి ||
11.భూమికి తన యాజ్ఞను - యిచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
|| దేవునికి ||
12.వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున - చేసియుండ లేదని
|| దేవునికి ||
13. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును
|| దేవునికి ||