1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
|| యెహోవా నా దేవా ||
2. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను
|| యెహోవా నా దేవా ||
3. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
|| యెహోవా నా దేవా ||
4. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
|| యెహోవా నా దేవా ||
5. నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
|| యెహోవా నా దేవా ||
6. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
|| యెహోవా నా దేవా ||
7. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును
|| యెహోవా నా దేవా ||