1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు
ధనము ఘనము అందచందము
అవి అన్నియును - నీటిబుడగలె
సమాధితోనే - సమాప్తమౌను
|| మాయ ||
2. పడగ విప్పిన - పామువలె నీ
పాపము నిన్ను వెంబడించును
పాప ఫలితము - మరణమేగదా
దాని అంతము నిత్యనరకము
|| మాయ ||
3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు
పరమును విడచి - ధరకువచ్చెను
నీకు బదులుగా - శ్రమల నోర్చెను
సిలువలోనే బలియాయె నేసు
|| మాయ ||
4. ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక
నీ పాపజీవితము నంతయు
నిన్ను క్షమించును కృపతో ప్రభువు
ఇదియే నీ రక్షణ దినముగా
|| మాయ ||
5. దేహమంత ప్రభు గాయముల్ పొందె
పరిశుద్ధ రక్తమును
కార్చెను - నిత్యజీవము నీకు నీయను
మృతిని గెల్చి తిరిగిలేచెను
|| మాయ ||