పల్లవి : ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా
రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
అనుపల్లవి : తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
1. ఉన్న పాటున రము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు
సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ
|| ఓపాపి ||
2. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు
పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్
|| ఓపాపి ||
3. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు
సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు
|| ఓపాపి ||
4. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు
సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను
|| ఓపాపి ||
5. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా
యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు
|| ఓపాపి ||
6. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన
నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్
|| ఓపాపి ||