1. ఓమా యేసు విను మామనవి
మా మధ్యకు ప్రభు రారమ్ము
నీ ద్వారమున చేరి యున్నాము
నింపుము ప్రభువా మమ్ములను
|| ప్రభు ||
2. దప్పిగొన్న వారికి జలము
యెండిన భూమికి జలధారల్
నీ సంతతిపై ఆత్మను పంపు
నీ దీవెనలతో నింపుము
|| ప్రభు ||
3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న
యేసు ప్రభువును చూపుము
ఆ మహిమా నివాసములోని
సమృద్ధితో మమ్ము నింపుము
|| ప్రభు ||
4. రెండు కెరూబుల మధ్య నుండి
మధుర స్వరము విననిమ్ము
యేసుని తప్ప యెవరిని వినక
ఆత్మలో తృప్తి పొందెదము
|| ప్రభు ||
5. తెరువబడిన పరమునుచూడ
దూతలు యెక్కుచు దిగుచుండ
నీ సంఘమును అభిషేకించి
ఘనకార్యములను జరిగించు
|| ప్రభు ||