పల్లవి : యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము
చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము
1. విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి
ఖర్జూర మట్టలు వస్త్రము లెందుకు
మీ హృదయములను పరువుడి
|| యెరుషలేము ||
2. అభ్యంతర పరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవనులన్
ప్రభుని విజయమునందు వారిని
స్తుతిస్తోత్రములు పాడనిమ్ము
|| యెరుషలేము ||
3. నీ ధుష్టక్రియలను బట్టి ప్రభుని దయము త్రోసెదవా
పరమ రాజును హృదయ మందిరమున
నేడే రానిమ్ము స్నేహితుడా
|| యెరుషలేము ||
4. నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా
గాయపడిన హస్తమును చాచి
నీ మదిలో చోటిమ్మనెను
|| యెరుషలేము ||
5. పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుము
జీవము రక్షణ శాంతి నొసగును
ఆయనే ప్రభువు శ్లాఘించుము
|| యెరుషలేము ||