1. శాంతి నాథుడేసుని సముఖములో
సంతసమే నిత్యము చింతలేదుగా
|| హల్లెలూయ ||
2. నా ప్రభువు తుడుచును నా కన్నీటిని
ప్రేమతోడ మందను పోషించును
|| హల్లెలూయ ||
3. సంతసమున దూతలు సంస్తుతించగా
పాడి మోక్షమందున మోదమొందెదన్
|| హల్లెలూయ ||
4. శత్రువునకు వెరువనేల సోదరులారా
దైవపుత్రులారా నిద్ర లేచి పాడుడి
|| హల్లెలూయ ||
5. యేసురాక వార్త మ్రోగె భాసురంబుగా
వచ్చుచున్నాడేసు సంఘ వధువు కొరకు
|| హల్లెలూయ ||
6. తెల్లవస్త్రములు లేక వెళ్ళజాలవు
రక్తములో కడుగుము వస్త్రములను
|| హల్లెలూయ ||