1. భక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి
వారి జీవితముల నెంచి చూచి
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
|| అడుగుడి ||
2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును
ఊహకుమించి చేయు దేవునిని
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
|| అడుగుడి ||
3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును
తన నామమునకు మహిమ కలుగ
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
|| అడుగుడి ||
4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి
మీరానంద భరితులగునట్లు
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
|| అడుగుడి ||
5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా
సర్వశక్తిగల మన దేవునడిగి
ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు
|| అడుగుడి ||