1. మోషే కంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్
వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము
ǁ సాగిలపడి ||
2. అహరోను కంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము
|| సాగిలపడి ||
3. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగా తానే యుండెన్
ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము
|| సాగిలపడి ||
4. యోనా కంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము
|| సాగిలపడి ||
5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము
|| సాగిలపడి ||
6. రాజుల కంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము
|| సాగిలపడి ||
7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము
|| సాగిలపడి ||