1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...
నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను
|| దేవసుతుడు ||
2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను ఆ ...
భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము
|| దేవసుతుడు ||
3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి ఆ ...
వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము
|| దేవసుతుడు ||
4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటిలో ఆ ...
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెను
|| దేవసుతుడు ||
5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో ఆ ...
పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని
|| దేవసుతుడు ||
6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - యేసు బయలుపడెను ఆ ...
జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును
|| దేవసుతుడు ||
7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము ఆ ...
హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్
|| దేవసుతుడు ||