1. యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన - ఏ భయముండదు
|| ఒక్కొక్క ||
2. సుఖంబు బొందగా - నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము
|| ఒక్కొక్క ||
3. నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున - నన్నున్ దీవించుము
|| ఒక్కొక్క ||
4. నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై - నన్నుండ జేయుము
|| ఒక్కొక్క ||