1. ప్రవాహ మెక్కిన శక్తిని వీడకు
దివ్య ప్రభునివాక్కు మారదెన్నడు
|| యోర్దాన్నది ||
2. వాక్యానుసారము పాదము పెట్టుము
ఏక దేవుడేసు మాటతప్పడు
|| యోర్దాన్నది ||
3. ఉన్నతరాజగు యేసు నీ దళకర్త
అన్ని శ్రమల నుండి కాచు నిక్కము
|| యోర్దాన్నది ||
4. కానాను చెంతను ప్రియుని రాజ్యము
కాంచెద దేశంబు నిత్యానందము
|| యోర్దాన్నది ||
5. ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశము
పాటచే దాని వర్ణింప వీల్పడదు
|| యోర్దాన్నది ||
6. ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము
ప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట
|| యోర్దాన్నది ||