1. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు
|| మాధుర్యంపు ||
2. వినుండి గొఱ్ఱెపిల్లను - విశ్వాసముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్
|| మాధుర్యంపు ||
3. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్
శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్
|| మాధుర్యంపు ||
4. ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు
|| మాధుర్యంపు ||
5. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు
|| మాధుర్యంపు ||
6. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
ప్రియంపు దాసులౌచును - రయంబు కొల్వుడేసున్
|| మాధుర్యంపు ||