1. ఆశ్చర్యముగా హృదయము మారెను - యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ
|| యేసుకు ||
2. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ
|| యేసుకు ||
3. ఈ జీవపు ఊట యొద్దకురా - హృదయము నిమ్ము యేసునకు
మున్గిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ
|| యేసుకు ||