1. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును
|| మంగళముగ ||
2. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు
|| మంగళముగ ||
3. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము
|| మంగళముగ ||
4. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
పాపికి జీవపానము - దివ్యవాక్యము
పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును
|| మంగళముగ ||
5. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము
|| మంగళముగ ||
6. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే
|| మంగళముగ ||