1. గురి చేరుటకే ఈ నా యాత్ర
సరిగా భువిలో నే చేరుటకు
కోరి నీ వెలుగు నే నడచుటకు
ప్రభూ! నడిపించు
|| వెలుగిచ్చి ||
2. ఘోరచీకటి నన్నావరింప
మార్గమున ఘోర తుఫాను రేగ
కరమునెత్తి ప్రభూ! గద్దించుము
ప్రభూ! రక్షించుము
|| వెలుగిచ్చి ||
3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే
నేనాశించితి నా హృదయములో
నను బలపరచి నిలుపుము
ప్రభూ! స్థిరముగను
|| వెలుగిచ్చి ||