1. యేసుని రక్తమే ముక్తిమార్గము
నా పాపమంతయు పరిహరించెను
|| యేసుని ||
2. యేసుని రక్తమే యేక మార్గము
నిండు నెమ్మదితో నింపెనన్ను
|| యేసుని ||
3. యేసుని రక్తమే సత్యమార్గము
సంతోష మిచ్చి స్థిరపరచెను
|| యేసుని ||
4. యేసుని రక్తమే శక్తి మార్గము
జయముతో నింపి జీవమిచ్చెను
|| యేసుని ||
5. యేసుని రక్తమే నిత్య మార్గము
పాప మరణముల పాడుచేసెను
|| యేసుని ||
6. యేసుని రక్తమే యుక్తమార్గము
ఆత్మకు శాంతియు హాయినిచ్చెను
|| యేసుని ||
7. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి
అందరం కలసి హల్లెలూయ పాడెదం
|| యేసుని ||