1. మేఘారూఢుడై వచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల
వీణె వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్
|| అదిగో ||
2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మృతులెవ్వరులేరు అచ్చట
అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్
|| అదిగో ||
3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును
నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్
|| అదిగో ||
4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను
అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్
|| అదిగో ||