1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి
యేసునం దైగుప్తు నుండి క్రీస్తునందరిని గాచిన
|| దేవుని ||
2. పాప ఋణముచేత నిత్య కోపమునకు గురియైతిమి
శాపగ్రాహియై శ్రీ యేసు పాప ఋణము తీర్చినాడు
|| దేవుని ||
3. మార్గ సత్య జీవమై నిత్య మరణ భయము లేనివాడు
మరణ బంధితులను గావ మరణమొంది లేచినాడు
|| దేవుని ||
4. నీతిమంతుడైన యేసు నీతి కార్యములను జేసి
నీతి నిలయుండై తండ్రి నిల నీతితోనే తృప్తిపరచెన్
|| దేవుని ||
5. యేడ్చెను మన పాపములకై కార్చెను తనరక్తము నిల
ఓర్చెను తన శత్రువులను గెల్చెను తన సిలువతోనే
|| దేవుని ||
6. లేదు నీకు భయము చింత లేదు నమ్మి నిలచినతో
నీదు స్వాస్థ్యమంత తిరిగి నాథుడేసులో పొందగలవు
|| దేవుని ||
7. జయము పాడు ప్రియుడ లేచి జయ జీవితము నొంది వేగ
జయశీలుండు కీస్తు యేసుని జయము పాడు హల్లెలూయ
|| దేవుని ||