1. యెహోవా మందిర పునాదిని వేసిన
దినమున పలికిన ప్రవక్తల మాటన్
నేటి దినమున వినెడి మీరు
ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు
|| యెహోవాను ||
2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల
కరుణతో తన కృప జూపుట మరువని
నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు
భూమ్యాకాశములందున లేడని
|| యెహోవాను ||
3. ఇల దావీదను పితరుని తోడ
సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
సొలొమోను నందా వాగ్దానములను
కన్నుల విందుగ నెరవేర్చెనుగా
|| యెహోవాను ||
4. పోవుడి, పోవుడి - తొలగిపోవుడి
అపవిత్రమైన దేని ముట్టకుడి
యెహోవా సేవోప కరణములను
మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి
|| యెహోవాను ||
5. ఆలకించుడి మీరు తన సేవకుడు
వివేకముగా ప్రవర్తించును గాన
ఉన్నతమైన స్థానమందుండి
ఘనుడైనవాడై హెచ్చింపబడును
|| యెహోవాను ||
6. పర్వతములపై ఎంతో సుందరములు
రాజ్య సువార్తను చాటించువారై
సీయోను! నీ దేవుడేలు చున్నాడని
సమాధానమును ప్రకటించు పాదములు
|| యెహోవాను ||
7. ఆ నగరములో నుండదు శాపము
దేవుని గొర్రెపిల్ల సింహాసనముండు
సేవింతురు తన దాసులాయనను
రవి తేజులై దివి రాజ్యమునందు
|| యెహోవాను ||