1. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము
గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము
|| వెళ్ళుదాం ||
2. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే
యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున
|| వెళ్ళుదాం ||
3.ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును
భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి
|| వెళ్ళుదాం ||