1. సుందర వరుడు యేసు ప్రభువు - సుందరవతి సీయోను
శాశ్వత శోభాతిశయముతో - భాసిల్లుటను జూచి
|| సంతసిల్లును ||
2. నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు
సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము
|| సంతసిల్లును ||
3. నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు
స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము
|| సంతసిల్లును ||
4. జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము
కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము
|| సంతసిల్లును ||
5. స్వర్ణ సమము దాని ప్రజలు సంతోష సహితులు
దూతలే వింతపడునట్లు ఖ్యాతిని కలిగిన వారు
|| సంతసిల్లును ||
6. మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు
ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు
|| సంతసిల్లును ||
7. దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది
జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్
|| సంతసిల్లును ||