1. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు
|| తలుపులు ||
2. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు
|| తలుపులు ||
3. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను
|| తలుపులు ||
4. రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము
|| తలుపులు ||
5. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము
|| తలుపులు ||