పల్లవి : హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి
1. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును
|| హల్లెలూయ ||
2. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను
|| హల్లెలూయ ||
3. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును
|| హల్లెలూయ ||