1. సకల ప్రజలకు సిలువలో యేసు
స్వర్గనగరికి మార్గము జూపి
రండి జీవజలము త్రాగుడనుచు
నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు
|| ప్రభు ||
2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు
ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
పాపాంధకారమును బాపినాడు
పావనపరచెను మమ్ములను
|| ప్రభు ||
3. పాపులు పశ్చాత్తాపము నొంది
పాపుల ప్రాపకుడేసుని జేరి
పాపవిముక్తిని బొంది మీరు
పావను డేసుని సంకీర్తించుడి
|| ప్రభు ||