1. చాలా రాత్రి గడిచిపోయె చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము
|| జాగ్రత్త ||
2. గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతుభార్యను మరచిపోకు మేలుకొనెడి సమయమువచ్చె
|| జాగ్రత్త ||
3. మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో
|| జాగ్రత్త ||
4. దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు
|| జాగ్రత్త ||
4. క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు
|| జాగ్రత్త ||