1. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి
|| నష్టము ||
2. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు
మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత
|| నష్టము ||
3. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను
|| నష్టము ||
4. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి
|| నష్టము ||
5. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను
|| నష్టము ||
6. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల
|| నష్టము ||