1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా (2)
రాజిల్లి వ్యాపింపజేయు దేవా (2)
2. కరుణతో అగ్నికణములను
కరిగించి హృదయము తాకించుము
3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే
దోషమెల్లను కాల్చి వేయుటకు
4. కన్యక వృద్ధులు యౌవనులు
ఉన్నత ఆత్మచే నింపబడన్
5. పాపులు పశ్చాత్తాపపడన్
శుద్ధుల మలినము పోగొట్టన్
6. పాపము శాపము లన్నియును
భస్మమి కాలి నశించునట్లు
7. యేసుని ప్రేమను రుచిచూడను
విశ్వాసమునందు వర్థిల్లను