పల్లవి : ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు
దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ
1. గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము
పాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు
|| ప్రభుతట్టు ||
2. చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచు
సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు
|| ప్రభుతట్టు ||
3. అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో
భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్
|| ప్రభుతట్టు ||
4. నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును
ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు
|| ప్రభుతట్టు ||