1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు
నిశీదరాత్రిన్ ప్రియుడా
ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే
ప్రియుల ప్రార్థన వినుమా
|| కరుణించుము ||
2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు
మా ప్రియులు నశియించుట
చూచి సహింపక కన్నీటితో చేయు
మా ప్రార్థన వినుమా
|| కరుణించుము ||
3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి
కరుణించి కాపాడితివే
యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ
నా బీదమనవి వినుమా
|| కరుణించుము ||
4. శ్రమలెన్నో సహించి రక్షించితివే
ఇవియన్నియు వ్యర్థంబౌనా?
అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి
ఆ ప్రార్థన వినుమా
|| కరుణించుము ||
5. శోధన నుండి రక్షించితివే
సొదొమలో భక్తుని
అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి
ఆది ప్రార్థన వినుమా
|| కరుణించుము ||