1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిని
నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి
|| యేసు ||
2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి
సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి
|| యేసు ||
3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని
రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే
|| యేసు ||
4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివే
మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద
|| యేసు ||
5. నిన్ను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే
ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే
|| యేసు ||