1. స్వామి యేసు తన సిలువను మోసి
సైతాను రాజ్యము - పూర్తిగా జయించె
నీవును యేసుని వెంబడి వెళ్ళుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
|| నీ వాత్మ ||
2. శిరమున ముండ్ల మకుటము ధరించి
సిపాయిచే తలపై కొట్టబడె
నీ శిరస్సు నట్లే సమర్పించు
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
|| నీ వాత్మ ||
3. కల్వరి పైకి - ఒంటరిగానే
వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
నీవును ఆ దారినే వెళ్ళుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
|| నీ వాత్మ ||
4. లోకస్తులంతా - నిద్రించుచుండగా
మోకాళ్ళపై యేసు - కొండపై నుండె
నీవును ప్రార్థన శక్తి నొందుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
|| నీ వాత్మ ||
5. సాహసమున నీ - వాత్మ ఖడ్గమున
సైతాను బంధము - ఖండించివేసి
క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
|| నీ వాత్మ ||