1. యెరూషలేము నగరు నీ గుమ్మములలో
మా పాదములు బాగుగా నిలుచుచున్నవి
|| యెహోవా ||
2. యెరూషలేమా బాగుగా కట్టబడిన
పట్టణమువలె కట్టబడియున్నావు
|| యెహోవా ||
3. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా
దేవుని జనము స్తుతించ వెళ్ళును
|| యెహోవా ||
4. జనముల యొక్క గోత్రములు
యెహోవా నామమును స్తుతింప వెళ్ళును
|| యెహోవా ||
5. అక్కడ దావీదు వంశీయుల యొక్క
నీతి సింహాసనము స్థాపించబడెను
|| యెహోవా ||
6. యెరూషలేము క్షేమము కొరకు
యెడతెగక ప్రార్థన చేయుడి
|| యెహోవా ||
7. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
యెన్నడును వర్ధిల్లెదరు గాక
|| యెహోవా ||
8. నీ ప్రాకారములలో నెమ్మది
నీ నగరులలో క్షేమముండును గాక
|| యెహోవా ||
9. నా సహోదర సహవాసుల నిమిత్తము
క్షేమము కలుగునని నేనందును
|| యెహోవా ||
10. దేవుడైన యెహోవా మందిరమును బట్టి
నీకు మేలుచేయ ప్రయత్నించెదను
|| యెహోవా ||