1. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు
|| హా! రక్షణంపు ||
2. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు
తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును
|| హా! రక్షణంపు ||
3. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం
ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు
|| హా! రక్షణంపు ||
4. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి
|| హా! రక్షణంపు ||