1. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు
|| తన రెక్కల ||
2. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా
చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను
|| తన రెక్కల ||
3. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు
|| తన రెక్కల ||
4. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు
|| తన రెక్కల ||
5. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు
|| తన రెక్కల ||
6. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను
|| తన రెక్కల ||
7. అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్
|| తన రెక్కల ||