1. ఏగుచుందు నిత్యము జీవమును బొందను
సిల్వలో కృపశక్తి పొందుదున్
శోధనలు వచ్చిన జయ మొందుచుందును
మోకరించి ప్రార్థింతు సిల్వచెంత
|| సిల్వలో ||
2. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల
ఆత్మసాయముచే సిల్వజూతును
యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా
భారముల మోయుశక్తి పొందుదున్
|| సిల్వలో ||
3. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము
యేసు రక్తమందు నిన్ను కడుగును
నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో
క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును
|| సిల్వలో ||