1. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో
అందరిని ప్రభు నిర్ణయించెను
పొందుగ పిలిచి నీతిగా తీర్చె
సుందరముగా మహిమపర్చు
|| యేసు ||
2. చేసెను మనలను తన రూపమున
బాసెను పాపముచే నా రూపం
యేసులో నొసగె మరల మనకు
వాసిగ కాచును పుత్రులుగా
|| యేసు ||
3. దేవుని ప్రేమించు వారందరికి
భువిలో జరుగునన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు
భావి మహిమతో పోల్చుటకై
|| యేసు ||
4. శ్రమయు బాధ హింసయైనను
కరువు వస్త్రహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గమైనను
ఎడబాపునే ప్రభు ప్రేమనుండి
|| యేసు ||
5. మరణము జీవమైనను
దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను
ఎడబాపరు ప్రభు ప్రేమనుండి
|| యేసు ||
6. ఆనాది దేవుని ఆ సంకల్పం
మనలో ప్రభుని బయలుపరప
మనవలెను మన పాపములు
పూనికతో పూర్ణ ఐక్యతకు
|| యేసు ||