పల్లవి : జీవపుదాత నా హృదయములోనికి రా
నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము
1. నూతన జన్మమును మా కొసగి – నూతనముగ మము చేయన్
నూతన ఆత్మ హృదయము నిమ్ము – నిను నే స్తుతియింపన్
|| జీవపుదాత ||
2. నూతన వ్యక్తిగచేయుము ప్రభువా – లోకము చూచునట్లు
నూతన వస్త్రాహారము లిచ్చి – సుందరునిగ చేయుము
|| జీవపుదాత ||
3. నూతన వాక్కులను మాకొసగి – నూతన గీతము నేర్పు
నూతన రాగమును మా కొసగి – నిత్యము స్తుతి పొందుము
|| జీవపుదాత ||
4. నూతన శక్తిని అందరికొసగి – నూతన మార్గము జూపు
నీదు మహిమ కొరకై నాకు – నూతన నడకను నేర్పు
|| జీవపుదాత ||
5. నూతన పాత్రగను ననుజేసి – నీదు మహిమతో నింపు
నూతన ఆయుధముగ మముజేసి – శత్రువును ఓడించు
|| జీవపుదాత ||