1. గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు
దొరుకు తన్ను వెదకు వారి కేసు
ఆరాధికులకు పరిశుద్ధుడేసు
నిరాశగలవారి మిత్రుడేసు
|| సర్వంబులో ||
2. నాదు మార్గంబునకు వెలుగు యేసు
నాదు పాదంబులకు దీపము యేసు
నాదు దాహంబునకు పానము యేసు
నాదు యజ్ఞానంబునకు జ్ఞానము యేసు
|| సర్వంబులో ||
3. నాదు రోగంబులకు వైద్యుడు యేసు
నాదు బాధ్యతల వహించు నేసు
నాదు ఏకాంతములో తోడు యేసు
నాకు తేనె కంటె బహు తీపి యేసు
|| సర్వంబులో ||
4. నాకు రక్షకుడు రక్షణ యేసు
నాకు విమోచకుడు విమోచ నేసు
నాకు జీవంబును దేవుడు యేసు
నాకు నీతి నాదు వెలుగు యేసు
|| సర్వంబులో ||
5. నాకు మాదిరి వెంబడించ యేసు
నాకు ముందు నడచు నాయకుడేసు
నాకు దుఃఖంబులో ఆదరణేసు
నాదు కష్టంబులో ధైర్యము యేసు
|| సర్వంబులో ||
6. నాదు హృదయంబున యున్నవాడు యేసు
నాదు వృద్ధికి కారకుండు యేసు
నాదు కృంగుదలలో తోడనుండు యేసు
నాదు సర్వమందు నిల సర్వమేసు
|| సర్వంబులో ||