1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం
|| స్తోత్రింతుము ||
2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడ శరణం శరణం
|| స్తోత్రింతుము ||
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడు వాడా
నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం
|| స్తోత్రింతుము ||
4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం
|| స్తోత్రింతుము ||
5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు
మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం
|| స్తోత్రింతుము ||
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం
|| స్తోత్రింతుము ||
7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం
|| స్తోత్రింతుము ||
8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందము శరణం శరణం
|| స్తోత్రింతుము ||
9. రాజ నీకే నమస్కారములు - గీతములు స్తుతి స్తోత్రములు
శుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయా ఆమేన్ ఆమేన్
|| స్తోత్రింతుము ||