1. మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం
ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం
మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్
పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి
|| సర్వములో ||
2. మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన
పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ
మున్ను నాదుకోరిక - నేడేసుమాట
పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి
|| సర్వములో ||
3. మున్ను నాపనియది - యికను తన పని
మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును
మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే
మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే
|| సర్వములో ||
4. మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు
మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి
మున్ను చావు గోరితి - నేడు తన రాకన్
నా నిరీక్షణలెల్ల – స్థిరమాయెను
|| సర్వములో ||