1. క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను!
హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను
చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను
కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు
|| క్రీస్తులేచె ||
2. క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను
నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్
శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను
వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్
|| క్రీస్తులేచె ||
3. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
లేనె లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె
నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము
|| క్రీస్తులేచె ||