యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?
నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?
పల్లవి : యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా
పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము
1. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?
నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా?
|| యేసు మహారాజు ||
2. ఇంక తామసించినచో - వెనుక మోసమగును
ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షనబ్బదు
|| యేసు మహారాజు ||
3. నేనే మృతి పొపిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము
నీదు జీవబలముల - నేడే సమర్పింపుము
|| యేసు మహారాజు ||
4. రేపు యని తామసింప - నష్టము సల్గు సదా
మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు
|| యేసు మహారాజు ||
5. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము
దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే
|| యేసు మహారాజు ||
6. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా
త్రోసివేయడెన్నడును - మంచి యేసునాథుడు
|| యేసు మహారాజు ||