1. లోకము నాలుగు దినముల నటనే నికరము గాదెవరికిని
దారిని తప్పి తిరిగెదవేల
ఎరిగితివా నీ గురిని కడకీలోకము వదలెదవు
|| యేసు ||
2. కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె
ప్రభువును నీవు మరచిపోతివి
పాడైపోయె నీ రూపం కడకీలోకము వదలెదవు
|| యేసు ||
3. ప్రభుయేసు సిలువలో వ్రేలాడె పాపిని రక్షించుటకు
పాట్లుపడె తనరక్తము కార్చె
పాపపు ముల్లును విరచె కడకీలోకము వదలెదవు
|| యేసు ||
4. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రమ్ము
ఆయన యందు నమ్మికయుంచిన
ఆయనే నీ శరణగును కడకీలోకము వదలెదవు
|| యేసు ||