పల్లవి : గడియ నేను తట్టుచున్నాను
మూఢముగా నుండక మనసు తెరువుము
1. భోజనము చేయనై శాంతిగా నిల్చుచున్నాను
ఆసనమునిచ్చిన ప్రేమను రుచింతువు
|| గడియ ||
2. ఆనందము పొందును నీ హృదయము నాకిమ్ము
కష్టదుఃఖముల నెల్ల పారద్రోలెదను
|| గడియ ||
3. నేనే మృతి పొందితిని నీ నాథుడను యేసు రాజును
పైన వెళ్ళి తండ్రితో మాటలాడుదు నీకై
|| గడియ ||
4. నా శిరస్సునందు ముండ్ల మకుటము ధరియించితిన్
హేమమకుత మీయను త్రోసినట్టి నీకై
|| గడియ ||
5. తామసము చేయక హృదయమును తెరువుము
తెల్లని వస్త్రములతో నిన్నలంకరింతును
|| గడియ ||
6. సైతాను దూతలను పారద్రోలెదను నేను
నాతాను ద్వారా నీకు పశ్చాత్తాపమిత్తును
|| గడియ ||
7. హల్లెలూయ పాడి నీ హృదయమును కిమ్ము
ప్రయుడనై నేను త్వరగా నీకై వత్తును
|| గడియ ||