1. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ
పరమానంద గీతమచ్చట ధ్వనింప - నీ వచట నుందువా? (3) నా మానసమా!
2. గొఱ్ఱెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర
మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపోస్తలులందరు
హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా? నా మానసమా!
4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు
దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!
5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు
జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి
భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!
నేనచట నుండెదను నా యేసుతోడ