1. ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టి
తెచ్చె నైగుప్తునకు - రాజుగా
చేసి తన ప్రజల అక్కరన్ తీర్చె
పాడు డల్లెలూయ
|| సర్వోన్న - తుడు ||
2. ఆలోచనకర్త మోషేను లేపె
పాలకుడైన ఫరో నెదిరింపన్
బలపరచి తన ప్రజలన్ విడిపించె
పాడు డల్లెలూయ
|| సర్వోన్న - తుడు ||
3. మహోన్నతుడు దానియేలున్ గాచె
మహాబాబెలునందు ఆయనే
మహారాజుగా మహిమ నొందెను
పాడు డల్లెలూయ
|| సర్వోన్న - తుడు ||
4. బలవంతుడేసు పేతురున్ గాచి
పౌలును బట్టి తెచ్చి సంఘమున్
కల్తీలేకుండ కట్టె సత్యాత్మతో
పాడు డల్లెలూయ
|| సర్వోన్న - తుడు ||
5. ఆది అంతము లేని మన యేసు
నాథుడు వచ్చుచున్నా డిదిగో
సిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ము
ఆమెన్ హల్లెలూయా
|| సర్వోన్న - తుడు ||