పల్లవి : ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా – హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ – ప్రతిపాపమును కడిగి
|| ప్రియయేసు ||
2. అజాగరూకుడనైతి – నిజాశ్రయము విడచి
కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రీ
|| ప్రియయేసు ||
3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనె
చేరితి నీదు దారి – కోరి నడిపించుము
|| ప్రియయేసు ||
4. ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము – ఆత్మీయ రూపుండా
|| ప్రియయేసు ||